Header Banner

వృద్ధుల దేశం కాకూడదు.. యువ శక్తితో అభివృద్ధి దిశగా భారత్! సీఎం చంద్రబాబు ప్రణాళిక!

  Sat Apr 05, 2025 16:47        Politics

ఉమ్మడి కృష్ణా జిల్లా నందిగామ నియోజకవర్గంలో సీఎం చంద్రబాబు పర్యటించారు. బాబూ జగ్జీవన్ రామ్ జయంత్రి సందర్భంగా ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. అప్పట్లో పరిస్థితుల దృష్ట్యా కుటుంబ నియంత్రణ పాటించమన్నామని, ఇప్పటి పరిస్థితుల నేపథ్యంలో దేశంలో జనాభా పెరగాల్సి అవసరం చాలా ఉందని అన్నారు. లేకపోతే, రాబోయే రోజుల్లో దేశంలో వృద్ధుల సంఖ్య పెరిగిపోతుందని అభిప్రాయపడ్డారు. అభివృద్ధి చెందిన దేశాల్లో ఇప్పుడు ఇదే సమస్యగా ఉందని తెలిపారు. వృద్ధుల సంఖ్య ఎక్కువగా ఉండే దేశాల్లో ఉత్పాదకత తగ్గిపోతుంటుందని వివరించారు. జనాభా వృద్ధి చెందడం అత్యంత ముఖ్యమైన అంశం అని స్పష్టం చేశారు. దేశంలో రెండో తరం సంస్కరణలకు శ్రీకారం చుట్టామని, 2047 నాటికి భారతదేశం ప్రపంచంలోనే అగ్రగామిగా ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు.

గత ప్రభుత్వం రూ.10 లక్షల కోట్ల అప్పు చేసి పోయింది!

రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ఇబ్బందికర పరిస్థితుల్లో ఉంది. గత ప్రభుత్వం ఇష్టానుసారం వ్యవహరించి రూ.10 లక్షల కోట్ల అప్పు చేసి పోయింది. నాయకుడు విధ్వంసం సృష్టిస్తే రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది. నాయకుడు దూరదృష్టితో ఆలోచిస్తేనే సమాజం బాగుంటుంది. అప్పట్లో నేను ఐటీ రంగాన్ని ప్రోత్సహించాను. ఇప్పుడు తెలుగువారు ప్రపంచంలోని ప్రతీ దేశంలో సత్తా చాటుతున్నారు. మట్టిలో మాణిక్యాల్లాంటివారు మన పిల్లలు. బాగా చదివిస్తే ప్రపంచాన్ని ఏలుతారు. ఇప్పుడు ఏపీలో సంపద సృష్టించే ప్రయత్నం చేస్తున్నాం. సంపదను సృష్టించి అందరికీ పంచుతాం. అట్టడుగున ఉన్న 25 శాతం మంది పేదల కోసమే పీ4 తీసుకువచ్చాం... అని చంద్రబాబు వివరించారు.


ఇది కూడా చదవండి: వైసీపీకి దిమ్మతిరిగే షాక్! పార్టీని విడిచిపోతున్న కీలక నేత!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

 ఆ కీలక ప్రాజెక్టుకు వీడనున్న సంకెళ్లు! మంత్రి సంచలన నిర్ణయం!

 

వివేక హత్య వెనుక మర్మం! అసలు వ్యక్తి మొదట అక్కడే! ఆ తర్వాత ఏం జరిగిందంటే?

 

ముగిసిన ఏపీ కేబినెట్ భేటీ.. తీసుకున్న కీలక నిర్ణయాలివే.! వారికి గుడ్ న్యూస్..

 

రూ.119 కోట్లు తప్పుదారిపట్టించిన రోజా.. ఆమె అరెస్టు పక్కా! ఎవ్వరూ ఆపలేరు..

 

రుషికొండ ప్యాలెస్‍పై మంత్రులతో సీఎం చర్చ! కీలక ఆదేశాలు.. సుమారు 400-500 కోట్ల రూపాయలుగా..

 

ఏపీ ప్రభుత్వానికి మరో శుభవార్త.. అమరావతికి వరల్డ్ బ్యాంక్ నిధులు.! రాజధాని నిర్మాణంలో దూసుకుపోవడమే..

 

తిరుమల వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్ - 100 శాతం ప్రక్షాళన.. టీటీడీ సమీక్షలో సీఎం కీలక ఆదేశాలు!

 

ఏపీ ప్రజలకు పండగలాంటి వార్త.. మరో బైపాస్కు గ్రీన్ సిగ్నల్! ఆ నాలుగు గ్రిడ్ రోడ్లు శాశ్వతంగా.. ఇక స్థలాలకు రెక్కలు?

 

సీఐడీ కస్టడీకి రంగా!… వంశీ గుట్లన్నీ వీడినట్టే.ఈ కేసులో కీలక పరిణామం..!

 

పార్టీ కార్యకర్తలతో మీటింగ్‌లో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు! దీని ఆధారంగా నామినేటెడ్పార్టీలో పదవులు స్పష్టం!

 

మాజీ మంత్రికి షాక్.. మరోసారి నోటీసు జారీ చేసిన పోలీసులు!

 

కొడాలి నాని ఆరోగ్యంపై వైద్యుల షాకింగ్ ప్ర‌క‌ట‌న‌! నెటిజన్లు భారీగా కామెంట్లు - సోషల్ మీడియాలో హల్ చల్!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #ChandrababuNaidu #YouthPower #IndiaDevelopment #PopulationGrowth